విజయవాడ కార్మిక నగర్ లోని కమ్యూనిటీ భవన్ ను ఎంపీ, ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేసి, స్థానిక ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. గురువారం స్థానికంగా భూగర్భ డ్రైనేజి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గతంలో నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ఎంపీ 12 కోట్ల రూపాయలు నిధులిస్తే తెలుగు దేశం పార్టీకి ఎక్కడ పేరు వస్తుందోనని నాయకులు అడ్డుకొన్నారని ఆరోపించారు.