అచ్యుతాపురం ఎస్. ఇ. జెడ్‌లో ఫార్మాలో జరిగిన ప్రమాదం చాలా బాధ కలిగించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. విజయవాడ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దాదాపు 17 మంది ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది క్షతగాత్రులు అయ్యారని అన్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.