కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం, కలియుగ వైకుంఠం ఏడుకొండలపై వెలసిన వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకంలో పాలు పంచుకునే అవకాశం సామాన్యులకు కూడా కల్పించడం ఎంతో ముదావహమని బిజెపి సీనియర్ నేత, రాష్ట్ర అధికార ప్రతినిధి పాతూరి నాగభూషణం అన్నారు. విజయవాడలోని రివర్ బ్రీజ్ అపార్ట్ మెంట్ వాసుల సహకారంతో 10 టన్నుల కూరగాయల వాహనానికి సోమవారం జెండా ఊపి ప్రారంభించారు.