నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో పాటు నైరుతి బంగాళాఖాతంలో ప్రతి ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాకి వర్ష సూచనా ఉన్నట్లు సమాచారం.