విజయవాడ: మత్స్యకారుల జీవనోపాధికి ప్రభుత్వం చర్యలు

84చూసినవారు
మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి కోసం కృష్ణా నదిలో భారీసంఖ్యలో చేపపిల్లల్ని విడుదల చేస్తున్నట్లు మైలవరంఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద బుధవారం గంగ పుత్రులతో కలసి చేప పిల్లలను కృష్ణానదిలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కృష్ణానదిలో మత్స్య సంపదను పుష్కలంగా పెంపొందించే క్రమంలో ప్రతి ఏడాది మత్స్యశాఖ ద్వారా చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్