ప్రభుత్వంలో వివిధ శాఖలు తమ పనితీరు మెరుగుపరచుకోవడానికి వీలుగా రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ సాంకేతిక సహకారాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా ఈ సంస్థ పనిచేసి మెరుగైన ఫలితాలను సాధించాలని సూచించారు. విజయవాడ కార్యాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు.