దసరా ఉత్సవాలలో ఎన్టీఆర్ జిల్లా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు
దసరా మహోత్సవాలను పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వివిధ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు 726 మంది గురువారం వివిధ ప్రాంతాలలో క్యూలైన్లను నియంత్రణ, మంచినీటి సరఫరా, వికలాంగుల సేవలు, ట్రాఫిక్ నియంత్రణ, భోజనాలు, ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ లో సేవలు అందించినట్లు డాక్టర్ కొల్లేటి రమేష్ తెలియజేశారు. ఒక్కొక్క బ్యాచ్ కి 250 మందిని కేటాయించినట్లు పోలీసు బందోబస్తు సేవలో ఉత్సాహంగా వాలంటీర్లు పని చేశారని తెలియజేశారు.