ఒంటిపై ఉన్న బంగారం కోసం కన్నతల్లి లక్ష్మిని ఆమె కుమారుడు సాంబ శివరావు భార్యతో కలిసి దిండుతో ఊపిరాడకుండా హత్య చేయగా అతనికి ఆమె భార్య సహకరించింది. ఈ ఘటన విజయవాడలోని గుణదల పోలీస్ స్టేషన్ పరిధి మధురనగర్ లో జరిగింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు బంగారు ఆభరణాల మాయంపై దర్యాప్తు చేసి కుమారుడే
హత్య చేశాడని నిర్దారించి 49 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకొని శుక్రవారం అరెస్ట్ చేశారు.