రైతులు ప్రభుత్వ సూచనలు పాటించాలి
ఉయ్యూరు మండలంలో రైవస్ కాలువ పరీవాహక గ్రామాల రైతులు, ప్రజలు నీటి ప్రవాహం గమనిస్తూ ప్రభుత్వ సిబ్బంది సూచనలు పాటించాలని ఉయ్యూరు తహసిల్దార్ సురేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. విజయవాడలో బుడమేరు వరద నీటిని రైవస్ కాలువ లోనికి పంపుతున్నారని తెలిపారు. భద్రత చర్యల్లో భాగంగా గ్రామ రెవిన్యూ అధికారులను, రెవెన్యూ సహాయకులను కాలువ గట్టుపై కాపలా ఉంచడం జరిగిందని తెలిపారు.