ఆదోనిలో సినీ హీరో బాలకృష్ణ జన్మదిన వేడుకలు
By W. Abdul 74చూసినవారుఆదోనిలోని భీమాస్ ప్రాంతంలో సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. అభిమాన సంఘం నాయకులు, టీడీపి శ్రేణుల ఆధ్వర్యంలో కేక్ కట్చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి ఉన్నత పదవులు అలంకరించి ప్రజా సేవకే అంకితం కావాలని ఆకాంక్షించారు.