కోడుమూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మేనేజ్మెంట్ బాలుర హాస్టల్ ప్రారంభించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యే దస్తగిరికి వినతిపత్రం ఇచ్చారు. జిల్లా సహాయ కార్యదర్శి రంగస్వామి మాట్లాడారు. హాస్టల్ లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. జూనియర్ కళాశాల ఆవరణలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే పేద విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంటుందన్నారు.