పెద్దకడబూరు: పంట పొలాల్లో జింకల బెడద

75చూసినవారు
పెద్దకడబూరు మండలం గంగలపాడు గ్రామం రోడ్డు శివారుల్లోని మిరప పొలాల్లో జింకల బెడద ఎక్కువగా ఉంది. మంగళవారం పొలాల్లో గుంపులు గుంపులుగా తిరిగి పంటలను నాశనం చేస్తున్నాయి. ఖరీఫ్ సీజన్లో పత్తి, కందులు, మొక్కజొన్న, కొర్ర మొదలగు పంటలను తమ పొలాల్లో సాగు చేశారు. పంటలు మొలక దశ వచ్చినప్పుడు జింకలు తమ పంట పొలాలను సర్వనాశనం చేస్తున్నాయని అక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్