కర్నూలు జిల్లా పెద్దకడబూరులోని 76వ కాలువ వద్ద పిలుగుండ్ల పరిసర పొల్లలో వారం రోజులుగా చిరుత సంచారం కలకలం రేపింది. చిరుతకు సంబంధించిన ఆనవాళ్లు దాని పాదాల జాడలు పొలాల్లో కనిపించాయి. చిరుత జడలు గమనించిన రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు వచ్చి పొలాల్లో సంచారించిన చిరుత జాడలను గుర్తించారు. అధికారులు రైతులతో మాట్లాడి చిరుత జాడలను పరిశీలించారు. చిరుత కనిపిస్తే మాకు సమాచారం ఇవ్వాలని సూచించారు.