ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిని గెలిపించుకొని ప్రజలే ఆయనకు కప్పం కడుతున్నారని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆదోనిలోని ఆయన మాట్లాడారు. మెడికల్ కళాశాల పనులను ప్రారంభించాలని అడిగితే అసత్య ఆరోపణలు చేశారన్నారు. ఆదోనికి మెడికల్ కళాశాల రెండో విడతలో మంజూరైందని, పనులు కొనసాగుతున్న సమయంలో ప్రభుత్వం మారిందన్నారు. ప్రజలకు చెప్పకుండా గత ప్రభుత్వంపై అబద్దం చెప్పడం మంచిది కాదన్నారు.