ఆదోని పట్టణంలో ఆటోనగర్ ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంగళవారం ఆయన ఆదోనిలో స్థానికులతో ఆటో యూనియన్ నాయకులు, కార్మికులతో కలిసి మాట్లాడారు. ఆటోనగర్ కాలనీ ఏర్పాటుకు స్థలం సేకరణకు చేపట్టనున్నట్లు, ఆలూరు రోడ్డులో 93 ఎకరాల భూమిని గుర్తించినట్లు తెలిపారు. పది వేల మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వగలిగే శక్తి ఆటోనగర్ లో ఉందన్నారు.