ఆళ్లగడ్డ తాలూకా కు 120 గోకులం షెడ్లు రావడం జరిగిందని, ఇప్పటివరకు 30 షెడ్లు పూర్తి అయ్యాయని, ఇందుకోసం ఆళ్లగడ్డ తాలూకా కు ప్రభుత్వం దాదాపు 2 కోట్ల 76 లక్షలు మంజూరు చేయడం జరిగిందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పేర్కొన్నారు. శనివారం మండలం లోని కోట కందుకూరు గ్రామంలో మినీ గోకులం షెడ్ ను ఆమె ప్రారంభించారు. ఎంపిడిఓ మహబూబ్ ఖాన్, గ్రామీణ ఎస్ఐ హరిప్రసాద్ ఉపాధిహమి ఎపిఎమ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.