ఆళ్లగడ్డ: అహోబిలం చెంచు కాలనీలలో సమగ్ర సర్వే నిర్వహణ

50చూసినవారు
ఆళ్లగడ్డ: అహోబిలం చెంచు కాలనీలలో సమగ్ర సర్వే నిర్వహణ
ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలం చెంచు కాలనీలో సమగ్ర సర్వేను సోమవారం అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి నరసింహ మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ ఎంపీడీవో మహబూబ్ ఖాన్ ఆధ్వర్యంలో గ్రామంలో నివసిస్తున్న చెంచు గిరిజనుల ఇళ్లకు సంబంధించి సమగ్ర సర్వేను చేపట్టడం జరిగిందన్నారు. రెవెన్యూ, సచివాలయ శాఖ సిబ్బంది కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్