ఆళ్లగడ్డ: మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి

73చూసినవారు
ఆళ్లగడ్డ: మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి
ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపో బస్సు సర్వీసులను పెంచి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. సోమవారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ డిపో నుండి కర్నూలుకు రెండు నూతన బస్సు సర్వీసులను ప్రారంభించారు. గత ప్రభుత్వంలో బస్సు సర్వీసులను తొలగించడం జరిగిందన్నారు. ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటికే నాలుగు సర్వీసులు కొత్తగా ప్రారంభించామన్నారు.

సంబంధిత పోస్ట్