సిరివెళ్ల సర్కిల్ పరిధిలోని రుద్రవరం , సిరివెళ్ల కోడి పందాలు, పేకాట వంటి జూదాలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని, సాంప్రదాయ క్రీడల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు తోడ్పడిన, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వంశీధర్ ఆదివారం స్పష్టం చేశారు. సంక్రాంతి పండగ సాంప్రదాయాలకు ప్రతీక. దాన్ని కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో, సాంప్రదాయ క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ జరుపుకోవాలన్నారు.