ఓ రైతుకు వజ్రం దొరికిన ఘటన తుగ్గలి మండలంలో శనివారం చోటు చేసుకుంది. తుగ్గలి మండలంలోని సూర్యతండాకు చెందిన ఓ రైతు పొలం పనులకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆయనకు 8 క్యారెట్ల బరువైన వజ్రం దొరికింది. దానిని జొన్నగిరికి చెందిన ఓ వ్యాపారి రూ. 10 లక్షలకు కొనేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.