1954లో 1 అడుగు ఎత్తు గణేశుడి విగ్రహాన్ని ఖైరతాబాద్‌లో ప్రారంభించారు. 1893లో బాలగంగాధర తిలక్ ఇచ్చిన పిలుపుతో స్ఫూర్తి పొందిన ఖైరతబాద్ మాజీ కార్పొరేటర్ అయిన సింగరి శంకరయ్య ఈ పండుగను ఐక్యతకు గుర్తుగా జరుపుకోవాలని ప్రారంభించారు. ఏడాదికో అడుగు పెంచుకుంటూ 60 అడుగులకు పైగా విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఖైరతాబాద్ గణేష్ చేతిలో కేవలం బొమ్మ లడ్డు మాత్రమే ఉంటుంది. ఖైరతాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 55 అడుగుల జంజం, 50 అడుగుల కండువా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.