దసరా సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్ యుఐ జిల్లా అధ్యక్షుడు వీరేష్ యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఎమ్మిగనూరులో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ అన్ని పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలకు అక్టోబర్ 3 నుంచి దసరా సెలవులు ప్రకటించిందని, అయితే కొన్ని విద్యాసంస్థలు ప్రత్యేక తరగతుల పేరుతో తరగతులు నిర్వహించాలని చూస్తున్నారని గుర్తు చేశారు.