ఆదివారం డిఎస్ఏ అవుట్డోర్ స్టేడియంలోని బాస్కెట్బాల్ ఏరీనా కోర్టులో సీనియర్ స్త్రీ, పురుషుల జిల్లా జట్ల ఎంపిక కార్యక్రమండిఎస్డిఓ భూపతి రావు ముఖ్య అతిధిగా పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు సాధన బాగా చేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. బాస్కెట్బాల్ ఆటలో ఆడిన వారికి చాలామందికి విద్యా ఉద్యోగాలలో మంచి అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.