జిల్లాలో ప్రసిద్ధి గాంచిన మాల మల్లేశ్వరస్వామి ఉత్సవాలలో భాగంగా ఈనెల 12 వ తారీకున జరగనున్న బన్నీ ఉత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జాయింట్ కలెక్టర్ నవ్య సూచించారు. శనివారం దేవరగట్టులో జరిగిన బన్ని ఉత్సవ సమీక్ష సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఇందులో భాగంగా రోడ్లు భవనాల శాఖ కొండపైన గుడి దగ్గర బారి కేడింగ్ చేయాలని ఆదేశించారు.