స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్రస్థాయి రగ్బీ అండర్ 14 , అండర్ 17 కు ఎంపికైన విద్యార్థినులకు నేమకల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెద్ద నాగన్న మంగళవారం క్రీడా దుస్తులను వితరణ చేశారు. బాలికలు క్రీడల్లో రాణించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించినప్పుడే వారికి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.