కోసిగి మండలంలో ఉన్న ముస్లిం సోదరులు మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలను జరుపుకున్నారు. మసీదులలో మహమ్మద్ ప్రవక్త యొక్క గొప్పతనాన్ని మత పెద్దలు వివరించారు. మిలాద్ ఉన్ నబీ వేడుకలను పురస్కరించుకుని గత వారం రోజుల నుంచి జామియా, నూరానీ సున్ని, మదీనా, మస్జీద్ ఏ అక్సా, మస్జీద్ ఏ అన్వరుల్హా ఫారుఖీ మసీదులలో ప్రత్యేకంగా ప్రసంగాలతోపాటు ప్రార్థనలు చేశారు.