దేవనకొండ మండలం నెల్లిబండ గ్రామ రైతులు ఆందోళన చెందుతున్నారు. హంద్రి కాలువపై ఆధారపడి పంటలు పండిస్తున్నా వారికీ కొన్ని రోజులుగా హంద్రీ కాలువ నీరు అందక వేరుశనగ పంట పూర్తిగా ఎండిపోయిందని ఆవేదన చెందుతున్నారు. హంద్రి కాలువ నీటి సమస్య గురించి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకులకు తెలిపినా తమకు ఎటువంటి ప్రయోజనం అందలేదని వాపోతున్నారు. నీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.