ఆలూరు రైతులకు 50 శాతం సబ్సిడీతో పప్పు శనగ విత్తనాలు పంపిణీ చేయాలని ఏపీ రైతు సంఘం మండల కార్యదర్శి ఈరన్న డిమాండ్ చేశారు. బుధవారం మండల వ్యవసాయ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ మంజునాథకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న క్వింటా పప్పుశనగ రూ. 9, 400కు గాను 25శాతంసబ్సిడీతో రూ. 7, 050కు అందించడం దుర్మార్గమని మండిపడ్డారు.