పోషణ మహోత్సవాల సందర్భంగా గురువారం బనగానపల్లె పట్టణంలోని ఎనిమిదోవ అంగన్వాడి కేంద్రం నందు తల్లుల సమావేశం నిర్వహించడం జరిగిందని సిడిపిఓ బి ఉమామహేశ్వరమ్మ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా సిడిపిఓ ఉమామహేశ్వరమ్మ మాట్లాడుతూ ముఖ్యంగా సమతుల్యమైన ఆహారం తీసుకోవడం వలన రక్తహీనత తగ్గించుకోవచ్చు అన్నారు. వ్యాధి నిరోధిక శక్తి పెరుగుతుందన్నారు. అంగన్వాడి సూపర్వైజర్ పి లక్ష్మి శైలజ తదితరులు పాల్గొన్నారు.