బనగానపల్లె ఎక్సైజ్ పరిధిలో నాటు సారా నియంత్రించేందుకు ఎక్సైజ్ అధికారులు ఎంతగానో కృషి చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం బనగానపల్లె ఎక్సైజ్ పరిధిలోని కొండనాయన పల్లె, పిక్కలపల్లి గ్రామాల పరిధిలో ఉన్న అడవిలో నాటు సారా తయారు చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఏడు బట్టీలను ధ్వంసం చేసి, 90 వేల లీటర్ల ఊట నేలపాలు చేయడం జరిగిందని ఎక్సైజ్ సీఐ వర్ణనాదేవి, నంద్యాల డి టి ఎఫ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ దాస్ లు తెలిపారు.