గూటుపల్లె గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం
బేతంచెర్ల మండలం గూటుపల్లె గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం బేతంచెర్ల మండల వ్యవసాయ అధికారి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంది, ఉల్లి, పొగకు మొదలగు పంట లను పరిశీలించడం జరిగింది. ఈ రబీ సీజన్ లో పంటలు వేసిన రైతులు, పంటలకు భీమా కోసం బ్యాంక్ లో లోన్ ఉండే రైతులు బ్యాంక్ లో ప్రీమియం చెల్లించాలి, బ్యాంక్ లో లోన్ లేని రైతులు మీ సేవ కేంద్రాల్లో ప్రీమియం చెల్లించాలన్నారు.