బేతంచర్ల సబ్ రిజిస్టర్ గా సి. వనిత లక్ష్మి
బేతంచర్ల పట్టణ సబ్ రిజిస్టర్ గా మంగళవారం సి. వనిత లక్ష్మి బాధ్యతలు చేపట్టారు. బదిలీల్లో భాగంగా బేతంచర్ల సబ్ రిజిస్టర్ గా పనిచేస్తున్న కరీం ఆత్మకూరుకు బదిలీపై వెళ్లగా, నంద్యాల జాయింట్ 2 సబ్ రిజిస్టర్ గా పనిచేస్తున్న సి. వనిత లక్ష్మి బేతంచర్లకు బదిలీ అయ్యారు.