బేతంచర్ల మండల పరిధిలోని శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి నరసింహస్వామిని జిల్లా జడ్జి కబర్డి, ఆయనతో పాటు డోన్ జడ్జి రాహుల్ అంబేద్కర్, ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వాళ్లకు ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు, వేద పండితులు పూర్ణకుంభము మంగళ వాయిద్యాలు మధ్య స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అనంతరం జడ్జిలకు తీర్థ ప్రసాదాలు,స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.