ప్రజా వ్యతిరేక విధానాలపై..

359చూసినవారు
ప్రజా వ్యతిరేక విధానాలపై..
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతరేఖ విధానాలపై ఈ నెల 14, 15, 16వ తేదీలలో రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించడం జరుగుతుందని ప్రజానాట్యమండలి ( PNM ) జిల్లా కన్వీనర్ కోయలకొండ నాగరాజు, ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ సభ్యులు D వెంకటేశ్వర్లు తెలిపారు,
బుధవారం స్థానిక సిపిఎం కార్యాలంలో మాట్లాడుతు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో వైస్సార్సీపీ ప్రభుత్వం కళలను ప్రోత్సహించడం లేదని, ప్రాచిన కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉందన్నారు.
ప్రాచిన కలలతోపాటు, వృత్తి కళకారులు కూడ కనుమరుగై ఉపాధిలేక కుటుంబం గడవక ఇబ్బంది పడుతున్నారని, వారు తెలిపారు,

కళాకారుల పెన్షన్ పెరిగిన ధరలకు అనుగుణంగా 3000రూపాయలు నుండి 5000రూపాయలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు,
రాష్ట్ర స్థాయి శిక్షణలో నూతన కళ రూపాలను తయారుజేసి, ప్రభుత్వం అనుసరించే తిరును ప్రజలకు తెలియజేసే బాధ్యత ప్రజానాట్యమండలి కలకారులపై ఉందన్నారు. తక్షణమే ప్రభుత్వం కళకారులకు ఉపాధి చూపించి ఆదుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్