డోన్ పట్టణంలోని కంబాలపాడు రోడ్డు హైవే ప్రక్కనున్న వైష్ణవి హాస్పిటల్ యాజమాన్యం దొంగ పేషెంట్లను సృష్టించి ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కోటి రూపాయలకు పైగా ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసిన హాస్పిటల్ యాజమాన్యంపై, సహకరించిన ఆరోగ్యశ్రీ సిబ్బంది పై తక్షణమే కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రభుత్వ సొమ్మును రికవరీ చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ( మార్కిస్ట్స్ ) సిపిఎం పట్టణ, మండల కార్యదర్శులు డిమాండ్ చేశారు.