సి. బెళగల్ మండలంలోని డీఆర్డీఏ వెలుగు కార్యాలయంలో ఏపీఎంగా పనిచేస్తూ, కర్నూలులో డీఆర్డీఏ హెడ్ ఆఫీస్ కు బదిలీ అయిన ఏపీఎం వెంకటస్వామిని మంగళవారం అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. స్థానిక స్త్రీ శక్తి భవన్ లో ఎంఎంఎస్ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యాక్రమంలో ఎంపీడీవో రాముడు, ఈఓఆర్డీ సందీప్, సి. బెళగల్ కెనరా బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసులు ఏపీఎం వెంకటస్వామి చేసిన సేవలను కొనియాడారు.