కోడుమూరు: కేసీ కాలువకు తగ్గిన నీటి విడుదల

60చూసినవారు
కోడుమూరు: కేసీ కాలువకు తగ్గిన నీటి విడుదల
కర్నూలు - కడప కాలువకు నీటి విడుదలను తగ్గించారు. వాతావరణంలో మార్పులు కారణంగా కర్నూలు జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా నీటిని పంటలకు పెట్టేందుకు ఆయకట్టుదారులు ఆసక్తి చూపకపోవడంతో ఇంజినీర్లు నీటి విడుదలను గురువారం ఉదయం 1540 క్యూసెక్కుల నుంచి 1058 క్యూసెక్కులకు తగ్గించారు. సుంకేసులకు 31, 270 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండటంతో 29, 939 క్యూసెక్కులు 7 గేట్లు పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్