వివాహ వేడుకలో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి నిండు ప్రాణాలు తీసిన ఇద్దరిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. కోడుమూరు సీఐ తబ్రేజ్ మాట్లాడారు. ఈనెల 14న కోడుమూరులో ఓ వివాహ వేడుకలో సురేంద్ర, జంబులయ్య మద్యం మత్తులో మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఉన్న దేవేంద్ర, మధుబాబు(25)లు సురేంద్ర, జంబులయ్యను వారించి అక్కడి నుంచి పంపిస్తుండగా, మధుబాబుపై వారు రాయితో దాడి చేయగా, గాయపడి చికిత్సలో కోలుకోలేక మృతి చెందాడు.