కోడుమూరు: భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తాం

74చూసినవారు
కోడుమూరు: భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తాం
జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు అన్నివిధాలుగా న్యాయం చేస్తామని స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ చిరంజీవి, కర్నూలు ఆర్డీవో కిడారి సందీప్ కుమార్ హామీ ఇచ్చారు. పొలాలకు వెళ్లేందుకు అనుగుణంగా సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వారం కిందట కర్నూలు రూరల్ మండలం నూతనపల్లె రైతులు నిరసన చేపట్టిన నేపథ్యంలో మంగళవారం ఆధికారులు జాతీయ రహదారిని పరిశీలించి, రైతులతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్