ఎమ్మిగనూరు నీలకంఠేశ్వర జాతర సందర్భంగా రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రికెట్ పోటీల్లో భాగంగా బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ వరల్డ్ కప్ ను తలపించింది. బుల్స్ బుల్లెట్, ముగతి జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో బుల్స్ బుల్లెట్ గెలుపొందింది. బుల్స్ బుల్లెట్ 12 ఓవర్లకు గాను 148 పరుగులు చేసింది. ఛేదనలో ముగతి జట్టు 42 పరుగుల తేడాతో ఓడిపోయింది. విన్నర్ జట్టుకు ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి రూ. 2 లక్షలు బహుమతి అందజేశారు.