ఆధునిక వ్యవసాయ పద్ధతులతోనే అధిక దిగుబడులు సాధ్యమని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మౌనిక స్పష్టం చేశారు. మంగళవారం పెద్దకడబూరు గ్రామ శివారుల్లోని వరి పంటపై పొలం పిలుస్తోంది కార్యక్రమం ఏఓ వరప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, నాయకులు మల్లికార్జున, వీరేష్ గౌడ్, నరశింహారెడ్ఢి, హజరత్ అలి, బొగ్గుల నరసన్న, క్రాంతి కుమార్ పాల్గొన్నారు.