కర్ణాటక మద్యం రాష్ట్రంలోకి రాకుండా అరికట్టేందుకు చెక్‌పోస్టు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఎక్సైజ్ ప్రొహిబిషన్ సూపరింటెండెంట్ ఎం. సుధీర్ బాబు అన్నారు. ఆదివారం మాధవరం చెక్‌పోస్టును తనిఖీ చేశారు. రికార్డులను సీసీ కెమెరాల పనితీరు కర్ణాటక మద్యం సరఫరా వంటి వాటిపై ఆరా తీశారు. సీసీ కెమెరాలు జిల్లా, రాష్ట్ర కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.