కోసిగి మండలంలోని గ్రామాల్లో నాటుసారా తయారీకి కిరాణం వ్యాపారులు బెల్లం విక్రయిస్తే చర్యలు తప్పవని ఎక్సైజ్ సీఐ భార్గవ్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం కోసిగిలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషనులో కిరాణం వ్యాపారులతో సమావేశం నిర్వహించి, మాట్లాడారు. ఎవరైనా ఐదు కేజీలకు మించి బెల్లంను కొనుగోలు చేస్తే వారి వివరాలు తమకు తెలియజేయాలన్నారు. లైసెన్సులు లేకుండా బెల్లం విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.