పెద్దకడబూరులోని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి ఫాం హౌస్ ను ఫ్రాన్స్, ఇండోనేషియాకు చెందిన శాస్త్రవేత్తలు ఏఓ వరప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం పరిశీలించారు. ఫాం హౌస్ లో ఉన్న మొక్కలను పరిశీలించారు. ఎలాంటి మొక్కలు నాటాలి, మొక్కలు నాటేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాటిపై సూచనలు చేశారు. అనంతరం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.