ఆసుపత్రికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసిన వాలంటీర్

1572చూసినవారు
ఆసుపత్రికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసిన వాలంటీర్
కోసిగి మండల కేంద్రమైన కోసిగిలోని స్థానిక రంగప్పగట్టు మెలిగేరి నాగరాజు నిన్నటి నెల నుంచి ఆరోగ్యం బాగులేక కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఈ నెల 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పెన్షన్ వచ్చింది. కావున పెన్షన్ పంచడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన గ్రామ వార్డు వాలంటీర్ ద్వారా కోసిగి పంచాయతీ నందు 5సచివాలయలు ఉన్నాయి. కోసిగి గ్రామ సచివాలయం 3 పరిధిలో విధులు నిర్వహిస్తున్న గలమగారి వెంకటేష్ అనే వాలంటీర్ కు క్లస్టర్లో రావడం జరిగింది. మంగళవారం ఉదయం కర్నూలు వెళ్లి వాలంటీర్ నాగరాజు అనే పెన్షన్ దారునకు పెన్షన్ అందజేశాడు. ఆ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ మంచి వ్యవస్థ అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్