దారిద్ర రేఖకు దిగువనగా ఉండి దీర్ఘకాలిక వ్యాధులు మరియు అనేక ప్రమాదాలకు లోనైన పేదలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి ప్రజలకు ఒక వరంలా ఉపయోగపడుతుందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. శుక్రవారం పగిడ్యాల మండల పరిధిలోని లక్ష్మాపురం గ్రామములో సూర్యనారాయణ గౌడ్ కు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రూ. 85, 226 చెక్కును అందజేశారు.