నందికొట్కూరు వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి బుధవారం విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టులో భారీ ఊరట లభించింది. సాయి ఈశ్వర్ అనే వ్యక్తి హత్య కేసులో బైరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విచారణ తాజాగా జరిగింది. అయితే ధర్మాసనం ఈ కేసును కొట్టి వేసింది. బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో పాటు మరో 9 మందిని నిర్దోషులుగా ప్రకటించింది.