పేదలకు మూడు సెంట్లలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, సిపిఐ జిల్లా నాయకులు ఎం. రమేష్ బాబు, ఏపి రైతు సంఘం జిల్లా నాయకులు పిక్కిలి. వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం నంద్యాల జిల్లాలోని జూపాడుబంగ్లా, పాములపాడు మండలాల సచివాలయం ముందు 400 మంది నిరుపేదలతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయా సచివాలయాలలో అర్జీలు సమర్పించారు.