నందికొట్కూరు పట్టణంలోని ఎస్. ఎస్. ఆర్ నగర్ లో మంచినీటి కొరతను తీర్చాలని ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు పిక్కిలి. వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శనివారం మున్సిపల్ కమిషనర్ బేబీకి కాలనీ వాసులతో కలిసి సమస్యను తెలియజేస్తూ వినతి పత్రం అందజేశారు. 30 రోజుల క్రితం మినీ ట్యాంక్ బోర్ మోటర్ రిపేర్ తీసుకెళ్లి 15 రోజులు కావస్తున్నా ఇంకా మోటర్ బిగించకపోవడంతో కాలనీ వాసులు నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.