నందికొట్కూరు మండలంలోని బిజినవేముల గ్రామంలో భూ సర్వే గ్రామ రెవెన్యూ సదస్సులో రైతుల పొలాల, సమస్యల పైన బుధవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా నాయకుల ఆధ్వర్యంలో భూ సర్వే డిప్యూటీ తాసిల్దార్ సత్యనారాయణకు రైతులతో కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసిన రైతుల బాధలు తీర్చడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు.